హైదరాబాద్, ఏప్రిల్ 18, 2025:: జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (GHIAL) నిర్వహిస్తున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA), గ్లోబల్‌గా గుర్తింపు పొందిన ఎయిర్పోర్టు కార్బన్ అక్కరేడిటేషన్ (ACA) ప్రోగ్రామ్‌లో అత్యున్నతమైన లెవల్ 5 కార్బన్ అక్రెడిటేషన్‌ను ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) చేత పొందింది. విమానాశ్రయాలు తమ కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలను అంచనా వేయడానికి ఈ ACA ప్రోగ్రామ్‌ను స్టాండర్డ్‌గా పరిగణిస్తారు. ఇందులో మొత్తం ఏడు స్థాయులు ఉన్నాయి: లెవల్ 1: మ్యాపింగ్, లెవల్ 2: రిడక్షన్, లెవల్ 3: ఆప్టిమైజేషన్, లెవల్ 3+: న్యూట్రాలిటి , లెవల్ 4: ట్రాన్స్ఫార్మేషన్ , లెవల్ 4+: ట్రాన్సిషన్ , మరియు అత్యున్నతమైన లెవల్ 5.
ఈ లెవల్ 5 గుర్తింపు GHIAL విమానాశ్రయాన్ని ACI ఆసియా-పసిఫిక్ & మిడ్‌లీస్ట్ ప్రాంతంలో ఈ స్థాయిని పొందిన టాప్ నాలుగు విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిపింది. ఇది RGIA యొక్క గ్లోబల్ క్లైమేట్ గోల్స్‌తో అనుసంధానమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. Scope 1 మరియు Scope 2 కార్బన్ ఉద్గారాలను నెట్ జీరో స్థాయిలో కొనసాగించడమే కాకుండా, 2050 లేదా అంతకంటే ముందే Scope 3 ఉద్గారాలనూ నెట్ జీరోగా మార్చే దిశగా కృషి చేస్తోంది.
 |
ఈ సందర్భంగా GMR ఎయిర్‌పోర్ట్స్ ఈ డీ & చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ మరియు ACI ఆసియా పసిఫిక్ & మిడ్‌లీస్ట్ ప్రెసిడెంట్ అయిన శ్రీ SGK కిషోర్ మాట్లాడుతూ, “హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్, Scope 1 & 2 ఉద్గారాలను నెట్ జీరోగా ఉంచే కృషిని కొనసాగిస్తూనే, Scope 3 నెట్ జీరో లక్ష్యాన్ని 2050 నాటికి సాధించేందుకు స్టేక్‌హోల్డర్లతో కలిసి పనిచేస్తుంది. ఇది UNFCCC పారిస్ ఒప్పందం (2015) ప్రకారం ఉష్ణోగ్రతల నియంత్రణ లక్ష్యాన్ని అనుసరిస్తుంది” అన్నారు.
ఈ విజయాన్ని అభినందిస్తూ ACI ఆసియా పసిఫిక్ & మిడ్‌లీస్ట్ డైరెక్టర్ జనరల్ శ్రీ స్టెఫానో బారోన్సీ మాట్లాడుతూ, “పర్యావరణ స్థిరత్వంలో భారతీయ విమానాశ్రయాలు ముందుండటం గర్వకారణం. హైదరాబాద్ విమానాశ్రయం సాధించిన విజయాలు భారత్ యొక్క డీకార్బనైజేషన్ లో నాయకత్వాన్ని చూపిస్తాయి. ఇది దీర్ఘకాలిక దృక్పథం మరియు బృందాల కృషి ఫలితంగా సాధ్యమైంది. ఇతర విమానాశ్రయాలూ ఇదే బాటలో నడవాలని ఆశిస్తున్నాం. ACI APAC & MID ఈ లక్ష్యాల సాధనకు అవసరమైన మద్దతును అందించడంలో కట్టుబడి ఉంది,” అన్నారు.
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ముఖ్యమైన సస్టైనబిలిటీ చర్యలు:
Scope 1 – నేరుగా ఉద్గమించే ఉద్గారాల నియంత్రణ:
- ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం
- బయోఫ్యూయల్స్ వినియోగం
- EV చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు
- తక్కువ GWP ఉన్న రిఫ్రిజరెంట్‌ల వినియోగం
Scope 2 – పరోక్షంగా విద్యుత్ వినియోగంతో ఉద్గమించే ఉద్గారాలు::
- ఆన్‌సైట్ 10 MWp సోలార్ ప్లాంట్ ద్వారా 100% గ్రీన్ ఎనర్జీ వినియోగం
- హై ఎఫిషియెంట్ లైటింగ్, HVAC, ఆపరేషన్లలో ఎనర్జీ సేవింగ్ టెక్నాలజీస్ వినియోగం
Scope 3 – మూడవ పార్టీ ఉద్గారాల నియంత్రణ:
- ఎయిర్‌లైన్స్, గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీలతో సహకార కార్యక్రమాలు
- సింగిల్-ఎంజిన్ ట్యాక్సింగ్, ఎలక్ట్రిక్ GSE వినియోగం
- ప్రీ-కండిషన్ చేసిన ఎయిర్ సప్లై, GSE టన్నెల్ ఆపరేషనలైజేషన్
- భవిష్యత్తులో SAF వినియోగ అవకాశాల పరిశీలన
కార్బన్ ఉద్గారాల తగ్గింపుకు కీలక చర్యలు:
- LEED సర్టిఫైడ్ ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ వంటి ఎనర్జీ ఎఫిషియెంట్ గ్రీన్ బిల్డింగ్స్
- గ్రీన్ బెల్ట్ అభివృద్ధి ద్వారా ఏడాదికి సుమారు 700 టన్నుల CO₂ శోషణ
- సాంప్రదాయ గ్రౌండ్ వెహికల్స్‌ను సోలార్, ఎలక్ట్రిక్ వెహికల్స్‌తో భర్తీ
- స్మార్ట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, LED అప్‌గ్రేడ్స్, HVAC మాడర్నైజేషన్
- నియమిత అంతర్గత ఆడిట్లు, ISO 50001:2018 ఎనర్జీ మేనేజ్‌మెంట్ అనుసరణ
GHIAL ఈ ప్రయత్నాలన్నింటినీ ఐక్యరాజ్యసమితి యొక్క సుస్టైనబల్ డెవలప్మెంట్ గోల 13 ( క్త్లెమేట్ యాక్షన్) అనుగుణంగా చేపట్టి, వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా బాధ్యతాయుతమైన దృక్పథాన్ని ప్రదర్శిస్తోంది.
2011లో ప్రారంభమైన ACA ప్రోగ్రామ్, విమానాశ్రయాల కార్బన్ ఉద్గార నిర్వహణను అంచనా వేసే గ్లోబల్ స్టాండర్డ్. ఇందులోని ఏడవ స్థాయి అయిన లెవల్ 5, నేరుగా ఉద్గమించే కార్బన్ ఉద్గారాలను నెట్ జీరోగా సాధించినట్లు సూచిస్తుంది. అంతేకాకుండా, పరోక్ష ఉద్గారాలపై వ్యవస్థాత్మకంగా పనిచేసే స్టేక్‌హోల్డర్ భాగస్వామ్యాలను కూడా ప్రతిబింబిస్తుంది.