శ్రీ జీ.ఎం. రావు

ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, జీఎంఆర్ గ్రూపు

మెకానికల్ ఇంజనీర్ అయిన శ్రీ జీ.ఎం. రావు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు గల GMR గ్రూపు వ్యవస్థాపక ఛైర్మన్.

రావు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లోని ఒక చిన్న పట్టణం నుండి వచ్చారు. భారతదేశపు ఆర్థిక సరళీకరణకు ముందు, తనకు ఎదురైన ప్రతి వ్యాపార అవకాశాన్నీ ఆయన సమగ్రంగా పరిశీలించారు. 1978 లో ఒక జనపనార మిల్లుతో మొదలుపెట్టిన ఆయన, 28 విభిన్న వ్యాపారాలతో ఎదురులేని ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా నిలిచారు.

1994లో ఆర్థిక సరళీకరణ తర్వాత, ఆయన పూర్తి వ్యూహాత్మకంగా ముందుకు సా . తనకు సంబంధించని వ్యాపారాలన్నింటినీ వదిలిపెట్టి, ప్రధాన మౌలిక సదుపాయాల రంగంపై దృష్టి సారించారు. దీనివల్ల బ్యాంకింగ్, బీమా, సాఫ్ట్‌వేర్, బ్రూవరీస్, జనపనార, పంచదార వంటి కొన్ని అత్యంత అధిక ఆకర్షణీయ వ్యాపారాల నుండి GMR గ్రూపు నిష్క్రమించింది. గడచిన 4 దశాబ్దాలకు పైగా, ఆయన GMR గ్రూపును విజయవంతంగా దేశంలో అత్యంత గుర్తింపు పొందిన బ్రాండులలో ఒకటిగా నిలిచేలా చేశారు. విమానాశ్రయాలు, ఎనర్జీ, హైవేలు ఇంకా SEZ లతో సహా నగర మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తూ, ఈ గ్రూపు ఇప్పుడు చక్కని వైవిధ్యత కలిగి, వృత్తినైపుణ్యంతో నిర్వహించబడుతోంది. ఈ వ్యాపార అవకాశాలు అన్నీ గ్రూపుకు, దేశానికి కొత్త అయినా, గ్రూపు అతిత్వరగా తన స్థాయిని పెంచుకొని, ప్రపంచ స్థాయి నాణ్యత గల సంపదను సృష్టించింది.

వ్యాపారం వేగంగా ఎదుగుతుండగా, శ్రీ జీ.ఎం. రావు సంస్థాగత నిర్మాణముపై కూడా తీవ్రంగా కృషి చేశారు. సంస్థాగత నిర్మాణములో నాలుగు మూలస్థంభాలయిన - ప్రజలు, ప్రక్రియ, పరిపాలన ఇంకా టెక్నాలజీ అనేవాటిపై ఎక్కువ దృష్టి సారించడం జరిగింది. GMR గ్రూపు లక్ష్యం " GMR గ్రూపు విలువను సృష్టించడం ద్వారా సమాజంలో మార్పును కనబరుస్తూ ఔత్సాహిక పారిశ్రామిక సంస్థలను నిర్మించే శాశ్వత సంస్థగా ఉంటుంది." GMR గ్రూపు యొక్క వైవిధ్యభరితమైన సంస్కృతిని ఏడు ముఖ్య విలువలు, నమ్మకాల కూర్పు ద్వారా నిర్వచిస్తారు.

"కుటుంబము వ్యాపారంలా నడవాలి, వ్యాపారాన్ని కుటుంబంలా నడపాలి” అని శ్రీ రావు నమ్ముతారు. "బలమైన కుటుంబ పాలన, బలమైన కార్పొరేట్ పాలనకు దారితీస్తుంది" అని ఆయన అంటారు. తొలినాటి నుండీ అన్ని మౌలిక సదుపాయాల సంపదల విషయంలో ESG - పర్యావరణము, సామాజిక ఇంకా పరిపాలనపై దృష్టి సారిస్తూ వస్తున్నారు.

'సమాజానికి తిరిగి ఇవ్వడం' అనే బలమైన స్వభావంతో ఆయన 30 సంవత్సరాల క్రితం GMR వరలక్ష్మి ఫౌండేషన్ స్థాపించారు. అది దేశవ్యాప్తంగా దాదాపు 20కి పైగా ప్రదేశాలలో ప్రతి సంవత్సరమూ లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేసే విధంగా విద్య, ఆరోగ్యసంరక్షణ, జీవనోపాధి ఇంకా సమాజాభివృద్ధి రంగాలలో చురుకుగా పని చేస్తోంది.

శ్రీ రావుకు అనేక అవార్డులు, గుర్తింపులు లభించాయి. "ఈ ఘనత అంతా కఠోర శ్రమ, ఇంకా అంకిత భావం కలిగి నన్ను అర్థం చేసుకుని, నా ఆశయాలను పంచుకుంటున్న నా GMR సహోద్యోగులకు, నా కుటుంబానికి చెందుతుంది" అని ఆయన నొక్కి చెబుతారు.

శ్రీ జీ.బీ.ఎస్ రాజు

మేనేజింగ్ డైరెక్టర్

శ్రీ జీ.బీ.ఎస్ రాజు కామర్స్ పట్టభద్రులు, ఆయన శ్రీ జీ.ఎం. రావు పెద్ద కుమారులు.

అతను జీ.ఎం.ఆర్. ఎనర్జీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టరుగా తన కెరీర్ ప్రారంభించారు మరియు 220 మెగావాట్ బార్జ్-మౌంటెడ్ పవర్ ప్లాంటును నెలకొల్పడానికి సంపూర్ణ బాధ్యత వహించారు. 2012-17 కాలంలో ఎనర్జీ రంగం ఛైర్మన్ గా అతని తదుపరి కార్యవిధి సందర్భంగా, ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టులతో సహా అనేక విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు సుమారు 7500 MW క్రోడీకృత సామర్థ్యముతో వివిధ అభివృద్ధి దశలలో అమలు చేయబడ్డాయి.

గ్రూప్ CFOగా శ్రీ.రాజు గారు 2006 లో జీ.ఎం.ఆర్. మౌలికసదుపాయాల మొదటి ఐపిఓ మరియు 2007, 2010 మరియు 2011 లో గ్రూప్ యొక్క ఎనర్జీ మరియు విమానాశ్రయ రంగాలలో సుమారు US$3 బిలియన్ మొత్తానికి లెక్కకట్టే కొన్ని అతిపెద్ద QIPలు మరియు ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల ద్వారా విజయవంతంగా గ్రూపుకు నేతృత్వం వహించారు.

అతను ప్రస్తుతం విమానాశ్రయ రంగానికి ఛైర్మన్ గా ఉంటున్నారు మరియు దానికి అదనంగా జీ.ఎం.ఆర్. గ్రూప్ యొక్క CSR విభాగమైన జీ.ఎం.ఆర్. వరలక్ష్మి ఫౌండేషన్ కు నేతృత్వం వహిస్తున్నారు మరియు గ్రూప్ వ్యాప్తంగా సమాచార సాంకేతికత మరియు డిజిటలైజేషన్ పనులను ముందుండి నడిపిస్తున్నారు. అతని దూరదృష్టి మరియు ఔత్సాహిక పారిశ్రామిక నైపుణ్యాలతో, జీ.ఎం.ఆర్. విమానాశ్రయ రంగము లోనికి ముందడుగు వేయడంలో మరియు హైదరాబాద్, ఢిల్లీ, ఇస్తాంబుల్ మరియు భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలను అభివృద్ధి చేయడంలో శ్రీ రాజు గారు కీలకపాత్ర పోషించారు. అంతర్జాతీయ వ్యాపారమును అభివృద్ధి చేయడంలో మరియు సబిహా గోకెన్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇస్తాంబుల్ మరియు జురోంగ్ ద్వీపం, సింగపూర్ లో ఒక పవర్ ప్రాజెక్టుతో సహా ప్రాజెక్టుల నిర్మాణములో గ్రూపుకు అతని వ్యూహాత్మక మార్గదర్శనం ఇవ్వబడింది.

శ్రీ. శ్రీనివాస్ బొమ్మిడాల

డైరెక్టర్

శ్రీ. శ్రీనివాస్ బొమ్మిడాల గారు పొగాకు ఎగుమతుల వ్యాపారములో తొమ్మిది దశాబ్దాలకు పైగా అనుభవం గల వ్యాపార కుటుంబం నుండి వస్తున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత, అతను 1982 లో కుటుంబ వ్యాపారంలో చేరాడు మరియు ప్రపంచవ్యాప్తంగా పొగాకు వ్యాపారాన్ని తదుపరి పెంచుకుంటూనే ఏరేటెడ్ వాటర్ బాటిలింగ్ ప్లాంటుల లోనికి వైవిధ్యంగా మారారు.

గ్రూప్ డైరెక్టర్ మరియు శ్రీ. జి.ఎం.రావు గారి అల్లుడైన శ్రీ. శ్రీనివాస్ బొమ్మిడాల గారు కంపెనీ యొక్క మొదటి డైరెక్టర్లలో ఒకరు. అనేక సంవత్సరాల పాటు, 1995 నుండీ, అతను విమానాశ్రయాలు, ఎనర్జీ, అర్బన్ ఇన్‌ఫ్రా, మరియు క్రీడలతో సహా గ్రూప్ యొక్క వ్యాపార విభాగాలన్నింటి బిడ్డింగ్, అభివృద్ధి మరియు కార్యనిర్వహణకు నేతృత్వం వహించారు.

దార్శనికత కలిగిన నాయకుడిగా ఉంటూ, గ్రూప్ కోసం అతను 1995 లో ఇండియాలో మొదటి PPP పవర్ ప్రాజెక్టులలో ఒకదానిని నెలకొల్పడం, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం (అతిపెద్ద PPP విమానాశ్రయ ప్రాజెక్టు) తరలింపుకు మొదటి మేనేజింగ్ డైరెక్టరుగా నాయకత్వం వహించడం, క్రీడల ఫ్రాంచైజీ సరళిలో గ్రూపును ముందుండి నడిపించడం అదేవిధంగా సంస్థ వ్యాప్తంగా ఐటి మరియు డిజిటల్ పరివర్తన చొరవలను పరిరక్షించడంతో సహా అనేక తనదైన శ్రేణి చొరవలకు నాయకత్వం వహించారు. అతని నాయకత్వం క్రింద, ఏరోట్రోపోలిస్ అనే భావజాలము ఉదయించింది మరియు ఢిల్లీ మరియు హైదరాబాదు ఏరో నగరాలలో రూపు దిద్దుకొంది. అప్పటి నుండీ, ఇవి బిజినెస్, వాణిజ్యం మరియు విహారం కొరకు ప్రపంచ గమ్యస్థానాలుగా మారాయి. 2012 నుండి 2017 వరకు, అతను విమానాశ్రయం యొక్క కార్యవ్యవహారాల ఛైర్మన్ గా పని చేశారు, ఆ కాలవ్యవధిలో, జీ.ఎం.ఆర్. ప్రపంచములో మొదటి ఐదు విమానాశ్రయ డెవలపర్లలో ఒకటిగా ఉద్భవించింది. అతను ఇండియా మరియు విదేశాలలో ప్రాజెక్టులను అనగా., గోవా (మోపా), సెబు (ఫిలిప్పైన్స్), క్రెట్ (గ్రీస్) మరియు మెడాన్ (ఇండొనేషియా) సాధించుకోవడం ద్వారా విమానాశ్రయ రంగం కోసం గణనీయమైన ఎదుగుదల పైప్‌లైన్ అందించారు.

అతను ఆగ్నేయాసియా మరియు గ్రీస్ లో గ్రూప్ యొక్క అంతర్జాతీయ విమానాశ్రయాల వ్యాపారానికి మరియు ఎనర్జీ పోర్ట్‌ఫోలియో పరివర్తనకు నేతృత్వం వహించడం కొనసాగిస్తున్నారు.

శ్రీ గ్రంధి కిరణ్ కుమార్

డైరెక్టర్

శ్రీ గ్రంధి కిరణ్ కుమార్, కామర్స్ లో పట్టభద్రుడైన శ్రీ గ్రంధి కిరణ్ కుమార్ గారు శ్రీ జి.ఎం. రావు గారి చిన్న కుమారుడు మరియు 2003 నుండీ కంపెనీ బోర్డులో సభ్యుడుగా ఉంటున్నారు.

కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలతో విమానాశ్రయాలు, హైవేలు మున్నగు రంగాల్లో ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్య మార్గము క్రింద గ్రూప్ కోసం అనేక విజయవంతమైన మౌలికసదుపాయాల బిడ్‌లను గెలుపొందడంలో అతను ప్రధాన సాధనంగా ఉంటున్నారు. అతను హైదరాబాద్, ఢిల్లీ, ఇస్తాంబుల్, మాలే విమానాశ్రయాల కోసం విజయవంతమైన బిడ్‌లకు అదే విధంగా రికార్డు సమయంలో ఢిల్లీ విమానాశ్రయం 3 వ టెర్మినల్ పూర్తి కావడానికి నిర్మాణ కృషిలో నాయకత్వం వహించారు.

పట్టణ మౌలికసదుపాయాలు మరియు హైవేల ఛైర్మన్ గా, అతను 10 ప్రాజెక్టుల వ్యాప్తంగా ~1,200 కిలోమీటర్ల హైవేల విభాగమును నిర్వహించారు. అతను ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఐపిఎల్ జట్టును స్వాధీనం చేసుకోవడం మరియు యాజమాన్యం చేయడం ద్వారా జీ.ఎం.ఆర్. గ్రూప్ క్రీడల విభాగంలో అభివృద్ధికి ముందడుగు వేయడంలో కూడా ప్రధాన సాధనంగా ఉన్నారు.

ప్రస్తుతం, అతను గ్రూప్ యొక్క క్రీడా వ్యవహారాలను చూసుకోవడానికి అదనంగా గ్రూప్ ఆర్థిక వ్యవహారాలు మరియు గ్రూప్ యొక్క కార్పొరేట్ వ్యూహాత్మక ప్రణాళికా విధులను అజమాయిషీ చేస్తున్నారు.

శ్రీ. ధర్మేంద్ర భోజ్‌వానీ

డైరెక్టర్

శ్రీ. ధర్మేంద్ర భోజ్‌వానీ గారు కామర్స్ పట్టభద్రులు మరియు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ & మేనేజ్‌మెంట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అసోసియేట్ సభ్యులుగా ఉన్నారు.

ప్రస్తుతం ఆయన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఫైనాన్స్) గా ఉన్నారు. అతను 32 సంవత్సరాల కమే ఎక్కువగా ఘనమైన అనుభవం మరియు వివిధ హోదాలలో AAI తో సహానుబంధం కలిగి ఉన్నారు. అతను తన ప్రస్తుత హోదాలో, కార్పొరేట్ అకౌంట్స్, మార్కెట్ బారోయింగ్స్, క్యాపిటల్ బడ్జెట్, ఫైనాన్షియల్ కాన్‌కరెన్స్ మున్నగు బాధ్యతలు చూసుకుంటున్నారు.

శ్రీ హెచ్.జె. దొర

డైరెక్టర్

శ్రీ హెచ్.జె. దొర, ఆంధ్రప్రదేశ్ మునుపటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అయిన శ్రీ హెచ్.జె. దొర ఇప్పుడు GHIAL బోర్డులో డైరెక్టరుగా ఉన్నారు.

అతను 1984 వరకూ పోలీస్ శాఖలో వివిధ హోదాలలో వివిధ జిల్లాలల్పని చేశారు. ఆ తర్వాత, 5 సంవత్సరాల పాటు అతను పోలీస్ ఇంటెలిజెన్స్ యందు పనిచేశారు. 1989 తొలి రోజుల నుండి 1992 ఆఖరి వరకూ, అతను APSRTC వైస్- ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టరుగా పనిచేశారు. ఆ తర్వాత అతను 1993 ఏప్రిల్ నుండి 1995 నవంబర్ వరకు పోలీస్ కమీషనరుగా మరియు 1996 నుండి 2002 మధ్య కాలములో డైరెక్టర్ జనరల్ మరియు ఐజి ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వర్తించారు.

అతను CISF, న్యూ ఢిల్లీ డైరెక్టర్ జనరల్ గా మరియు సెంట్రల్ విజిలెన్స్ కమీషన్ యందు విజిలెన్స్ కమీషనరుగా కూడా పని చేశారు. అతను "శౌర్యసాహసాల కొరకు పోలీస్ పతకము", "ప్రతిభావంతమైన సేవ కొరకు పోలీస్ పతకము" మరియు "విశిష్టమైన సేవ కొరకు రాష్ట్రపతి పోలీస్ పతకము" వంటి అవార్డులను అందుకున్నారు.

శ్రీ. సి. ప్రసన్న గారు

డైరెక్టర్

శ్రీ. సి. ప్రసన్న గారు జీ.ఎం.ఆర్. గ్రూపుతో సుమారు 28 సంవత్సరాల పాటు పలు రకాల విధులు నిర్వర్తిస్తూ అనుబంధం కలిగియున్నారు. మేనేజ్‌మెంట్ లో పోస్ట్-గ్రాడ్యుయేట్ అయిన శ్రీ. ప్రసన్న గారు 37 సంవత్సరాలకు పైగా ఘనమైన మరియు వైవిధ్యమయమైన కార్పొరేట్ అనుభవం కలిగి ఉన్నారు. GHIAL యందు చేరడానికి ముందు, అతను జీ.ఎం.ఆర్. ఇండస్ట్రీస్ లిమిటెడ్ (GIDL) డైరెక్టర్ (ఫైనాన్స్) గా GIDL యొక్క ఫెర్రో అల్లాయ్స్, బ్రెవరీస్, మరియు పంచదార విభాగాలకు బాధ్యులుగా ఉన్నారు. జీ.ఎం.ఆర్. గ్రూపుతో పనిచేయడానికి ముందు, ఆయన 9 సంవత్సరాల పాటు నాగార్జున గ్రూపుతో పని చేశారు.

శ్రీ. సి. ప్రసన్న గారు ప్రస్తుతం జీ.ఎం.ఆర్. గ్రూప్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ఉన్నారు మరియు అతను కార్పొరేట్ వ్యవహారాల విధులకు కూడా నేతృత్వం వహిస్తున్నారు, అక్కడ అతను తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో హైదరాబాద్ విమానాశ్రయము మరియు భోగాపురం విమానాశ్రయముతో పాటుగా ఎనర్జీ మరియు అర్బన్ మౌలికసదుపాయాల వంటి గ్రూప్ యొక్క వ్యాపార విభాగాలకు బాధ్యులుగా ఉంటున్నారు.

శ్రీ. జయేష్ రంజన్, ఐఎఎస్

డైరెక్టర్

శ్రీ. జయేష్ రంజన్ గారు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) 1992 బ్యాచ్ అధికారిగా ఉన్నారు మరియు ప్రస్తుతం అతను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సమాచార సాంకేతిక విభాగము (ఐటి) ప్రిన్సిపల్ సెక్రెటరీగా ఉంటున్నారు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు మమరియు వాణిజ్య విభాగము యొక్క ప్రిన్సిపల్ సెక్రెటరీగా ఉంటున్నారు.

అతను ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి మనస్తత్వ శాస్త్రములో ఒక మాస్టర్స్ డిగ్రీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, కలకత్తా నుండి బిజినెస్ మేనేజ్‌మెంట్ లో డిగ్రీ, మరియు సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ, లీ కువాన్ యూ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ నుండి పబ్లిక్ మేనేజ్‌మెంట్ లో మాస్టర్స్ డిగ్రీ పొంది ఉన్నారు.

అతను యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హ్యామ్ (పర్యావరణసంబంధిత పాలసీ విశ్లేషణపై), జికా ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, టోక్యో (సరస్సుల నష్ట నివారణపై), లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (ప్రపంచీకరణ మరియు నాయకత్వముపై), కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్, హార్వార్డ్ యూనివర్సిటీ (పబ్లిక్ పాలసీపై), మరియు స్వీడిష్ ఇన్‌స్టిట్యూఇన్‌స్టిట్యూట్, స్టాక్‌హోమ్ (సుస్థిరత్వం మరియు CSR పై) లో స్వల్పకాలవ్యవధి కోర్సులను కూడా చేశారు.

అతను 1992 ఐఏఎస్ బ్యాచ్ యందు ఆలిండియా టాపర్ గా ఉన్నారు. అతనికి 2002 వ సంవత్సరంలో ప్రపంచ బ్యాంక్ యొక్క సోషియల్ క్యాపిటల్ విజిటింగ్ స్కాలర్‌షిప్ అవార్డు మరియు 2005లో బ్రిటిష్ ప్రభుత్వం యొక్క గురుకుల్ ఛెవెనింగ్ స్కాలర్‌షిప్ ప్రదానం చేయబడింది.

అతను ప్రపంచ బ్యాంక్, UN-ESCAP, మెక్సికో యొక్క సెడాటు ప్రాజెక్టు కొరకు, మరియు యుఎస్ఏ యొక్క YES, Inc మరియు ఇటలీ నుండి NMC వంటి యువత సమస్యల కొరకు పనిచేస్తున్న అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల కొరకు అంతర్జాతీయ సలహా సంప్రదింపుల అసైన్‌మెంట్లను చేశారు.

అతను భారత ప్రభుత్వముచే ఏర్పాటు చేయబడిన 'నాయకత్వంలో శిక్షకుల జాతీయ సమకూర్పు' లో భాగంగా ఉన్నారు, మరియు కొత్తగా నియమించబడిన సివిల్ సర్వెంట్స్ శిక్షణ మరియు మార్గదర్శకత్వంలో నిమగ్నమై ఉన్నారు.

తెలంగాణ ప్రభుత్వము యొక్క సమాచార సాంకేతికత (ఐటి) శాఖకు కార్యదర్శిగా అతని కార్యవ్యవహారాలు, వివిధ ప్రభుత్వ ప్రక్రియలలో ఐటి వినియోగపు అవకాశాలను గుర్తించడం, కొత్త పెట్టుబడులను ఆకర్షించడం, మరియు పౌరుల డిజిటల్ సాధికారతను పెంపొందించడం ఇమిడి ఉంటాయి. అతని గడచిన కొన్ని అసైన్‌మెంట్లలో ఇవి ఉన్నాయి: పారిశ్రామిక అభివృద్ధి పెంపుదల రంగములో పరిశ్రమల శాఖ కమీషనర్ మరియు మేనేజింగ్ డైరెక్టరుగా, పర్యాటక ప్రోత్సాహక పెంపుదల శాఖలో కార్యదర్శిగా, మరియు హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా) వైస్-ఛైర్మన్ గా అన్నింటికీ ఒక్కొక్కదానికి 2-3 సంవత్సరాల పాటు పని చేశారు, మరియు రాష్ట్రం లోని వివిధ ప్రాంతాలలో వివిధ గ్రామీణాభివృద్ధి వ్యవహారాల్లో 12 సంవత్సరాల పాటు గిరిజన అభివృద్ధి, సహజ వనరుల యాజమాన్యము, పేదరిక నిర్మూలన, మరియు ఇతర సంబంధిత సామాజికాభివృద్ధి వంటి వివిధ రంగాలలో పని చేస్తున్నారు.

శ్రీ. జయేష్ రంజన్ గారు అనేక సామాజిక, సాంస్కృతిక మరియు ధార్మిక దాతృత్వ కార్యాలకు తోడ్పడుతున్నారు, మరియు అతను యునైటెడ్ వే (హైదరాబాద్), సేవ్ ఎ ఛైల్డ్'స్ హార్ట్ (SACH) ఫౌండేషన్, యంగ్ లైవ్స్ ఇండియా, సేవ్ ది చిల్డ్రన్, స్పర్శ్ హాస్పీస్, ఎపిమాస్, ఎంఎల్ జయసింహ స్పోర్ట్స్ ఫౌండేషన్, హైదరాబాద్ 10 K ఫౌండేషన్, విజయా ఫౌండేషన్ ట్రస్ట్, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, LSN ఫౌండేషన్, తేజస్ ఫౌండేషన్, మ్యాజిక్ బస్ హైదరాబాద్, హాకీ హైదరాబాద్, వలర్ల్డ్ వైడ్ ఫండ్ (హైదరాబాద్ చాప్టర్), హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ మరియు స్పిక్-మ్యాకే బోర్డులు/సలహా మండళ్ళలో సభ్యులుగా ఉన్నారు.

శ్రీ. కె. రామక్రిష్ణా రావు, ఐఎఎస్

డైరెక్టర్

శ్రీ. కె. రామక్రిష్ణా రావు, ఐఎఎస్, గారు, కంపెనీ బోర్డుపై డైరెక్టరుగా తెలంగాణ ప్రభుత్వముచే నామినేట్ చేయబడ్డారు.

శ్రీ రావు గారు వరుసగా ఐఐటి కాన్పూర్ మరియు ఢిల్లో నుండి ఇంజనీరింగ్ యందు పట్టభద్రులు మరియు మాస్టర్స్ డిగ్రీ పొంది ఉన్నారు, మరియు ఇన్వెస్ట్‌మెంట్స్ లో ఎంబిఏ చేశారు.

శ్రీ. రామక్రిష్ణా రావు కూడ్లిగి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ 1991 బ్యాచ్ అధికారి. అతను ప్రస్తుతం తెలంగాణా ప్రభుత్వం, ఆర్థిక శాఖకు ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా ఉంటున్నారు. రాష్ట్ఱ ఆర్థిక వ్యవహారాల వివేకవంతమైన మరియు సుస్థిరమైన యాజమాన్యము అతని బాధ్యతగా ఉంది. అతను ఇంతవరకూ కొత్త రాష్ట్రం యొక్క బడ్జెట్‌లు అన్నింటినీ సమర్పించారు మరియు రాష్ట్రం యొక్క పతాకస్థాయి పథకాలకు కావలసియున్న ఆర్థిక వనరులను సమీకరించారు. రాష్ట్రములో పెంపొందిత ఆర్థిక నియంత్రణ మరియు పారదర్శకతకు దారి తీసే సమీకృత ఆర్థిక యాజమాన్య వ్యవస్థను అతను విజయవంతంగా పరిచయం చేశారు.

శ్రీ. రావు గారు కొత్త రాష్ట్రమైన తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన వ్యవహారాలు అన్నింటితో వ్యవవ్యవహరిస్తూ రాష్ట్రాల గుర్తింపు డిపార్ట్‌మెంటుతో బాధ్యులుగా ఉంటున్నారు మరియు సుపరిపాలన కేంద్రం యొక్క డైరెక్టర్ జనరల్ గా కూడా విధులు నిర్వహిస్తున్నారు మరియు దేశం లోని అనేక రాష్ట్రాలలో అసంఖ్యాకమైన, ప్రధానంగా ఐటి ఆధారిత సంస్కరణ కార్యక్రమాలలో ప్రమేయం కలిగి ఉన్నారు.

శ్రీ. రావు గారు విద్య, ఆరోగ్య సంరక్షణ రంగాలలో అనేక నాయకత్వ హోదాలను కూడా చేపట్టారు మరియు ఆదిలాబాద్ మరియు గుంటూరు జిల్లాలకు కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ గా కూడా పని చేశారు.

శ్రీ మధు రామచంద్ర రావు

ఇండిపెండెంట్ డైరెక్టర్

శ్రీ మధు రామచంద్ర రావు గారు వృత్తి రీత్యా ఒక చార్టర్డ్ అకౌంటెంటుగా ఉన్నారు. అతను మెస్సర్స్. ఎన్.ఎం. రాజు & కో., చార్టర్డ్ అకౌంటెంట్స్ యందు 1976 నుండి 1988 వరకు సుమారు 12 సంవత్సరాల పాటు ఒక భాగస్వామిగా ఉన్నారు.

ఆ తర్వాత శ్రీ మధు రావు గారు మెస్సర్స్ షాంగ్రీ- లా హోటల్స్ & రిసార్ట్స్, హాంగ్ కాంగ్ తో 1988 నుండి 2017 వరకు సుమారు 30 సంవత్సరాల పాటు గ్రూప్ ఫైనాన్షియల్ కంట్రోలర్, CFO, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు వైస్-ఛైర్మన్ గా వివిధ హోదాలలో సహానుబంధముతో ఉన్నారు. అతను హాంగ్ కాంగ్ లో షాంగ్రీ- లా గ్రూప్ యొక్క మూడు తరాల వారితో పని చేశారు మరియు అతను బోర్డు యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా కూడా ఉన్నారు మరియు కంపెనీ మరియు 1988 లో 9 హోటళ్ళ నుండి 101 హోటళ్ళ వరకూ దాని వ్యాపార ఎదుగుదలలో కూడా పాలు పంచుకున్నారు. అతను కార్పొరేట్ మరియు అకౌంటింగ్ పాలసీలు మరియు పద్ధతుల కూర్పు, ప్రతిభా స్వాధీనత, పెట్టుబడుల విశ్లేషణ, మార్కెటింగ్ వ్యూహాలు, ఆడిటర్లతో అనుసంధానం, స్నేహపూర్వక మదుపరి సంబంధాల నిర్వహణ, ప్రభుత్వముతో పెట్టుబడి ప్రోత్సాహకాలపై బేరసారాలు, కార్పొరేట్ బంధం మరియు హక్కుల సమస్యలు మున్నగువాటితో సహా బిజినెస్ యొక్క ముఖ్య కార్యకలాపాలు అన్నింటిలోనూ చురుకుగా పాల్గొన్నారు.

శ్రీ. జొయాంతా చక్రబోర్తి

డైరెక్టర్

శ్రీ. జొయాంతా చక్రబోర్తి, ఎలెక్ట్రికల్ ఇంజనీర్ల భారతీయ రైల్వే సర్వీస్ (IRSEE) (2005)కి చెందిన శ్రీ. జొయాంతా చక్రబోర్తి గారు ప్రస్తుతం పౌర విమానయాన మంత్రిత్వశాఖలో డైరెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. పౌర విమానయాన మంత్రిత్వశాఖలో అతని బాధ్యతలలో భాగంగా, మంత్రిత్వ శాఖలో విభాగాధిపతిగా ఉంటూ అతను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI), దేశవ్యాప్తంగా ఉన్న కొత్త గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ అభివృద్ధి, పరిపాలనను చూసుకుంటున్నారు. అతను AAI యొక్క విమానాశ్రయాలన్నింటి అనుసంధానం కొరకు బాధ్యులుగా ఉంటున్నారు అదేవిధంగా భారత ప్రభుత్వము యొక్క వివిధ మంత్రిత్వశాఖలు మరియు ఏజెన్సీలతో కొత్త గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాల అభివృద్ధి కొరకు అనుసంధానం చేసుకుంటున్నారు.

అతను 2005 బ్యాచ్ IRSEE ఎలెక్ట్రికల్ ఇంజనీరుగా మరియు ఒడీషా క్యాడర్ 2011 బ్యాచ్ మాజీ-ఐపిఎస్ అధికారిగా ఉన్నారు. అతను జాదవ్‌పూర్ యూనివర్సిటీ నుండి బ్యాచెలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పట్టా పొందారు.

అతను 2006వ సంవత్సరంలో అసిస్టెంట్ డివిజనల్ ఎలెక్ట్రికల్ ఇంజనీర్ గా భారతీయ రైల్వే సర్వీసులో చేరారు మరియు వడోదరా లోని భారతీయ రైల్వే యొక్క జాతీయ అకాడెమీ (NAIR) యందు మరియు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ (IRIEEN) లో అతని ప్రొబేషనరీ శిక్షణ తీసుకున్నారు. ఆ తదుపరి అతను, ఈరోడ్ లోకో షెడ్, సేలం డివిజన్, దక్షిణ రైల్వే యందు అసిస్టెంట్ డివిజనల్ ఎలెక్ట్రికల్ ఇంజనీర్/ ట్రాక్షన్ కాలింగ్ స్టాక్ గా పనిచేశారు మరి ఆ తర్వాత చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ యందు ఎలెక్ట్రిక్ లోకో ప్రొడక్షన్ మరియు డిజైన్ యందు పని చేశారు.

ఆ తర్వాత అతను 2011లో ఇండియన్ పోలీస్ సర్వీసులో చేరారు మరియు లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడెమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (LBSNAA), ముస్సోరీ మరియు సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడెమీ (SVPNPA), హైదరాబాద్ యందు శిక్షణ పొందిన తర్వాత, అతను ఒడీషా, గంజాం జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా నియమితులయ్యారు. అతను తాను తొలుత పనిచేసిన భారతీయ రైల్వే సర్వీసులో తిరిగి చేరడానికి గాను 2013 లో ఐపిఎస్ వదిలేశారు మరియు చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ మరియు మెట్రో రైల్వే కోల్‌కతాలో వివిధ హోదాలలో, డిప్యూటీ ఛీఫ్ ఎలెక్ట్రికల్ ఇంజనీర్ గా, POH వర్క్‌షాప్, నోవాపారాలో ఇన్-ఛార్జ్ గా ఎలెక్ట్రిక్ నిర్వహణ, ప్రాజెక్టు మరియు నిర్మాణములో పనిచేశారు, అక్కడ అతను ప్రయాణికుడు వసతి సదుపాయాలు, మెట్రో రైల్వేల ఆస్తుల పరిరక్షణ మరియు భద్రత, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) తో ప్లానింగ్ మరియు సమన్వయం మరియు ప్రాజెక్టు అమలు విభాగాలను చూసుకున్నారు.

అతను 2020 మార్చి నుండి 2020 డిసెంబర్ వరకు రైల్వే బోర్డులో ఎలెక్ట్రికల్ అభివృద్ధి విభాగములో డైరెక్టరుగా పనిచేశారు, అక్కడ ఆయన మాధేపుర మరియు మార్హోవారాలో లోకోమోటివ్స్ తయారీ కొరకు భారతీయ రైల్వేలలో అతిపెద్ద FDI గల రెండు అత్యంత ప్రతిష్టాత్మక జాయింట్ వెంచర్ ప్రాజెక్టులను చూసుకున్నారు.

భారతీయ రైల్వేలలో సరుకురవాణా రైళ్ళు అన్నింటిలో ట్రైన్ టెలిమెట్రీ ప్రాజెక్టుల అంతానికి నిబంధన కొరకు రైల్వే బోర్డు యొక్క మంజూరు తీసుకోవడంలో క్కూడా అతను సాధనంగా ఉన్నారు.

అతను CRRC డలియాన్, చైనాలో మెట్రో టెక్నాలజీపై మరియు మూడంచెల కళాత్మకమైన అత్యధిక హార్స్ పవర్ ఎలెక్ట్రిక్ లోకోమోటివ్ ప్రొపల్షన్ టెక్నాలజీపై అల్‌స్టోమ్, ప్యారిస్ లో శిక్షణ తీసుకున్నారు.

శ్రీ. ఆంథోనీ క్రోంబెజ్

డైరెక్టర్

శ్రీ. ఆంథోనీ క్రోంబెజ్ గారు ఆర్థిక కమిటీకి అంకితమైన ఫ్రెంచ్ సెనేట్ సర్వీస్ కొరకు డైరెక్టరుగా తన కెరీర్ ప్రారంభించారు. అతను 2017 ఫిబ్రవరిలో గ్రూప్ ADP లో ADP ఇంటర్నేషనల్ కోసం ప్రాజెక్ట్ మేనేజరుగా చేరారు, ఆ తర్వాత ఛైర్మన్ మరియు CEO కు సీనియర్ సలహాదారుగా పని చేశారు. 2018, ఏప్రిల్ 1 నుండి అమలులోనికి వచ్చినట్లుగా అతను గ్రూప్ ADP ఛైర్మన్ మరియు CEOకు అనుసంధానమైన సిబ్బందికి ముఖ్యుడిగా నియమించబడ్డారు.

శ్రీ. ఆంథోనీ క్రోంబెజ్, గారు ప్రస్తుతం జీ.ఎం.ఆర్. ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు డిప్యూటీ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా ఉన్నారు మరియు మునుపు గ్రూప్ ADP ఛైర్మన్ మరియు CEOకు అనుసంధానమైన సిబ్బందికి ముఖ్యుడిగా పని చేశారు. అతను ఎకోల్ నార్మేల్ సుపీరియెర్ మరియు యూనివర్సిటీ ప్యారిస్ I - పాంథియోన్-సోర్బోన్ నుండి గ్రాడ్యుయేట్ పట్టా పొందారు.

శ్రీ. కేమిలో పెరెజ్ పెరెజ్

డైరెక్టర్

శ్రీ. కేమిలో పెరెజ్ పెరెజ్ గారు 2007 తొలి రోజుల నుండీ విమానాశ్రయ రంగముతో అనుబంధం కలిగి ఉన్నారు, అప్పుడు అతను ప్రాజెక్ట్ మేనేజర్ మరియు ఎకనమిస్టుగా ADP గ్రూపులో చేరారు. అతను ప్రపంచవ్యాప్తంగా దక్షిణ అమెరికా మరియు మధ్య ప్రాచ్య దేశాలలో విమానాశ్రయ బృహత్ ప్రణాళిక ప్రాజెక్టులలో చాలా విస్తృతంగా పని చేశారు. 2017 నుండీ ఇప్పటివరకూ, అతను గ్రూప్ ADP యొక్క ఎకనమిక్ రెగ్యులేషన్, ట్రాఫిక్ మరియు విమానాశ్రయం కెపాసిటీ అధిపతిగా ఉన్నారు. అతను విమానాశ్రయ ఛార్జీలు (విమానాశ్రయ వాడుకదారులతో సంప్రదింపులు, ఫ్రెంచ్ ఇండిపెండెంట్ సూపర్వైజరీ అథారిటీ), ట్రాఫిక్ ముందస్తు అంచనా, మరియు విమానాశ్రయ కెపాసిటీ పర్యవేక్షణకు బాధ్యులుగా ఉన్నారు. అతను ACI యూరప్ ఎకనామిక్స్ కమిటీలో గ్రూప్ ADPకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, అక్కడ అతను వైస్-ఛైర్మన్ గా ఉన్నారు.

శ్రీ సుబ్బారావు అమర్తలూరు

ఇండిపెండెంట్ డైరెక్టర్

శ్రీ సుబ్బారావు అమర్తలూరు గారు ఒక కామర్స్ పట్టభద్రులు మరియు చార్టర్డ్ అకౌంటెంటు. అతను ఫైనాన్స్ లీడర్‌షిప్‌లో సుస్థాపితమైన మరియు నిరూపితమైన ట్రాక్ రికార్డు మరియు ఆర్థికవ్యవహారాల యొక్క బహుముఖ రంగాలలో ఎండ్-టు-ఎండ్ ప్రావీణ్యం కలిగి ఉన్నారు, ఆడిట్ ఆచరణలు, తయారీ రంగం, మరియు మౌలిక సదుపాయాలు వంటి పారిశ్రామిక విభాగాలలో 35 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు.

ఇతర హోదాల పైకీ, అతను మేనేజింగ్ డైరెక్టర్-ఫైనాన్స్-సనామర్ గ్రూప్, CLP ఇండియాలో మే 2016 నుండి ఏప్రిల్ 2020 వరకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ - ఫైనాన్స్ మరియు స్ట్రాటజీ, ఆగస్టు 2013 నుండి మే 2016 వరకు RPG గ్రూప్ లో గ్రూప్ CFO గా మరియు జీ.ఎం.ఆర్. గ్రూపులో డిసెంబర్ 1999 నుండి ఆగస్టు 2013 వరకు పని చేసిన కాలములో జీ.ఎం.ఆర్. గ్రూప్ CFO గా పని చేశారు.

శ్రీ సుబ్బారావు గారు సంస్థాగత నిర్మాణము, నాయకత్వ అభివృద్ధి, సామరస్య పూర్వక బాహ్య సత్సంబంధాల నిర్వహణ మరియు అంతర్గతంగా మరియు ప్రజా వేదికలు రెండింటిలోనూ సమర్థవంతమైన సమాచార వినిమయములో పరిణతి చెందిన బలాలు కలిగి ఉన్నారు. అతను ICAI చే ఏర్పాటు చేయబడిన కొన్ని కమిటీలలో బాధ్యతలు తీసుకోవడం ద్వారా చార్టర్డ్ అకౌంటెన్సీ వృత్తినిపుణుల అభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డారు మరియు భారత ప్రభుత్వముచే ఏర్పాటు చేయబడిన కొన్ని కమిటీలలో పని చేయడం ద్వారా ఇన్‌ఫ్రా రంగ అభివృద్ధికి దోహదపడ్డారు.

డా. ఎం. రామచంద్రన్

ఇండిపెండెంట్ డైరెక్టర్

డా. ఎం. రామచంద్రన్, గారు ఉత్తరాఖండ్ క్యాడర్ నుండి 1972 బ్యాచ్ యొక్క రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. అతను చరిత్ర, ఆర్థికశాస్త్రములో బి.ఏ చేశారు (యూనివర్సిటీ ప్రథములు) మరియు కేరళ యూనివర్సిటీ నుండి ఆర్థికశాస్త్రములో ఎం.ఏ చేశారు. అతను యు.కె, యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో నుండి ఎం.ఫిల్ - ఎకనామిక్ ప్లానింగ్ కూడా చేశారు. అతను 'ప్రత్యేకించి ఇండియా సూచికకు సంబంధించి ప్రాజెక్ట్ ప్లానింగ్‌కు ప్రత్యామ్నాయ విధానాలు' - 2009 పరిశోధనా సిద్ధాంతవిశ్లేషణ కొరకు లక్నో యూనివర్సిటీ నుండి ఆర్థిక శాస్త్రములో డైరెక్టొరేట్ ఆఫ్ ఫిలాసఫీ కలిగి ఉన్నారు.

అతను ఇండియాలో సుమారు 40 సంవత్సరాల వివిధ రంగాల అపెక్స్ స్థాయి పాలసీ తయారీ అనుభవం మరియు క్షేత్రస్థాయి అమలులో విశేషపరిచయం కలిగి ఉన్నారు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలు రెండింటిలోనూ పని చేశారు.

2006 నుండి 2010 వరకు 4 సంవత్సరాల పాటు భారత ప్రభుత్వ, పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ కార్యదర్శిగా, అతను భారతదేశ నగరాలను పరివర్తన చేయుటలో మైలురాయి కాలవ్యవధిగా విస్తృతంగా గుర్తించబడిన కాలములో దేశపు పట్టణ రంగ పాలసీలు, సంస్కరణలు మరియు చొరవలకు సారధ్యం వహించారు.

అతను చేపట్టిన వివిధ కార్యవిధుల్లో మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ఉన్నత విద్య వంటి రంగాలలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, అర్బన్ స్థానిక సంస్థలు, యూనివర్సిటీలు, సొసైటీలు / ఫౌండేషన్‌లకు సలహాదారు / కన్సల్టెంటుగా పనిచేయడం; అర్బన్ సామర్థ్య పెంపుదల కొరకు జాతీయ సారధ్య సంఘం సభ్యులుగా పనిచేయడం; భారతదేశ 12వ పంచ-వర్ష ప్రణాళిక (పట్టణాభివృద్ధి)కు సంబంధించి ప్రణాళికా సంఘం యొక్క సారధ్య సంఘము / కార్యనిరత సమూహము సభ్యులుగా; ప్రపంచబ్యాంక్ సలహాదారుగా పనిచేయడం ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో అతను ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవితో సహా వివిధ ఉన్నత హోదాలలో పని చేశారు.

శ్రీ. ఇస్కందర్ మిజాల్ మహమూద్

డైరెక్టర్

శ్రీ. డాటో' ఇస్కందర్ మిజాల్ మహమూద్ గారు మలేషియా ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ బెర్హాద్ మేనేజింగ్ డైరెక్టరుగా ఉన్నారు.

శ్రీ. డాటో' ఇస్కందర్ గారు 32 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఒక కార్పొరేట్ లీడర్ మరియు బహుళజాతీయ కంపెనీల నుండి GLC ల వరకూ అనేక కంపెనీలలో, బహుళ రంగాలలో పని చేశారు, అందులో 18 సంవత్సరాల పాటు లీడర్‌షిప్ హోదాలలో పని చేశారు. అతను ఇంతకు మునుపు మలేషియా ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ బెర్హాద్ (MAHB) లో జనరల్ మేనేజర్ (1999-2003)గా పని చేశారు, అక్కడ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) మరియు బర్సా మలేషియా పై MAHB లిస్టింగ్ విధులు నిర్వర్తించారు. MAHB లో అతను పనిచేసిన విభాగాలలో ఫైనాన్స్, కార్పొరేట్ ఫైనాన్స్, బిజినెస్ డెవలప్‌మెంట్, మరియు మదుపరి సంబంధాలు చేరి ఉన్నాయి. అతను భారతదేశపు హైదరాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ వ్యవహారాలు మరియు కంబోడియా ఫ్‌నోమ్ పెన్హ్ సియెమ్ రీప్ విమానాశ్రయాల బాధ్యతలు చేపట్టడంతో సహా అంతర్జాతీయ వెంచర్లలో కూడా పనిచేశారు.

శ్రీ. డాటో' ఇస్కందర్ గారు పిఓఎస్ మలేషియా బెర్హాద్ (2013-2015) యొక్క గ్రూప్ CEO గా పనిచేసి ఉన్న అనుభవముతో పోస్టల్ మరియు లాజిస్టిక్స్ నేపధ్యము కూడా కలిగి ఉన్నారు. అతను టర్న్అ‌రౌండ్ చొరవలలో ప్రత్యేక నైపుణ్యము సంపాదించుకొని ఉన్నారు మరియు అనేక GLCS టర్న్అ‌రౌండ్ లో పాల్గొని ఉన్నారు. అతను 2019 నుండి 2021 వరకు మీడియా ప్రైమా బెర్హాద్ యొక్క టర్న్అ‌రౌండ్ (2019-2020 గ్రూప్ డైరెక్టరుగా, మరియు 2020-2021 గ్రూప్ మేనేజింగ్ డైరెక్టరుగా) కూడా నాయకత్వం వహించారు. అతను మలేషియన్ బయోటెక్నాలజీ కార్పొరేషన్ Sdn Bhd యొక్క వ్యవస్థాపక ముఖ్య కార్యనిర్వహణాధికారిగా మరియు మలేషియన్ Bio-XCell Sdn Bhd (2005-2011) యొక్క ఛైర్మన్ గా కూడా టెక్నాలజీ రంగములో పనిచేశారు. అతను టెక్నాలజీ రంగపు పబ్లిక్ లిస్టెడ్ కంపెనీల బోర్డులపై అనగా., తేటా ఎడ్జ్ బెర్హాద్ (ఛైర్మన్ 2017-2019, ఇండిపెండెంట్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (INED) 2019-2021) మరియు గ్లోబెట్రానిక్స్ టెక్నాలజీ బెర్హాద్ (INED 2012-2021) లో కూడా పనిచేశారు. అతను మునిసిపల్ ఎడ్యుకేషన్ మలేషియా Sdn Bhd (2011-2013) యొక్క మేనేజింగ్ డైరెక్టరుగా కూడా పని చేశారు.

శ్రీ. డాటో' ఇస్కందర్ గారు లెంబాగా టబంగ్ హాజీ ఇన్వెస్ట్‌మెంట్ ప్యానల్ (2016-2018)లో ఉన్నారు మరియుభూమిపుత్ర మర్చంట్ బ్యాంకర్స్ బెర్హాద్ మరియు కామర్స్ ఇంటర్నేషనల్ మర్చంట్ బ్యాంకర్స్ బెర్హాద్ (1991-1999) తో సహా అగ్రగామి ఆర్థిక సంస్థలలో పనిచేశారు. అతను తన కెరీర్‌ని 1989 లో ఆర్థర్ అండర్సన్ & కో తో ప్రారంభించారు.

శ్రీమతి బిజల్ తుషార్ అజింక్యా

ఇండిపెండెంట్ డైరెక్టర్

శ్రీమతి బిజల్ తుషార్ అజింక్యా గారు ముంబై విశ్వవిద్యాలయం నుండి అంతర్జాతీయ న్యాయశాస్త్రములో L.L.M చేశారు. ఆమె ఖైతాన్ & కో.,లో భాగస్వామిగా ఉన్నారు మరియు వారి ముంబై ఆఫీసులో ప్రత్యక్ష పన్ను, ప్రైవేట్ క్లయింట్ మరియు ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ ప్రాక్టీస్ గ్రూప్స్ చూస్తున్నారు. పన్ను విభాగంలో 20 సంవత్సరాలకు పైగా ఉన్న అనుభవముతో శ్రీమతి అజింక్యా గారు ఇంటర్నేషనల్ ట్యాక్స్ మొదలగు కఠిన పన్ను సమస్యలపై అభిప్రాయాలను అందిస్తూ ప్రాథమికంగా ఇంటర్నేషనల్ ట్యాక్స్, ఇన్‌బౌండ్ మరియు ఔట్‌బౌండ్ ఇన్‌వెస్ట్‌మెంట్ల నిర్మాణం, M&A ట్యాక్స్ చర్చల పైన దృష్టి సారిస్తున్నారు.

పన్ను వ్యాజ్యం అభిముఖంగా, ఆమె విశిష్టమైన వ్యాజ్యపు వ్యూహాలపై సలహాలను అందించడంలో ఎంతో ఎక్కువ అనుభవం కలిగి ఉన్నారు మరియు ఇండియాలో అనేక విజయవంతమైన మరియు దారి బద్దలు కొట్టే పన్ను వ్యాజ్యాలలో ప్రధాన సలహాదారుగా ఉన్నారు. ఆమె ఇండియాలో అనేక ఇంటర్నేషనల్ ట్యాక్స్ వ్యాజ్యాలను ముందుండి నడిపించారు; ఇండియా-మారిషస్ ట్యాక్స్ ట్రీటీ - ఆజాదీ బచావో ఆందోలన్, విదేశీ విభాగ మదుపరులకు కనీస ప్రత్యామ్నాయ పన్ను వర్తింపు, మొ. ఆమె ఒక అంతర్జాతీయ మధ్యవర్తిత్వంలో భారతీయ పన్ను వ్యవహారాలపై నిపుణులైన సాక్షిగా కూడా పనిచేశారు. ఆమె HNI మరియు వారి వ్యాపారాలకు వారి వారసత్వ ప్రణాళిక అవసరాలపై సహాయతను అందిస్తున్నారు.

శ్రీ జీ.ఎం. రావు

ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్

శ్రీ జీ.బీ.ఎస్ రాజు

మేనేజింగ్ డైరెక్టర్

శ్రీ. శ్రీనివాస్ బొమ్మిడాల

డైరెక్టర్

శ్రీ గ్రంధి కిరణ్ కుమార్

డైరెక్టర్

శ్రీ. ధర్మేంద్ర భోజ్‌వానీ

డైరెక్టర్

శ్రీ హెచ్.జె. దొర

డైరెక్టర్

శ్రీ. సి. ప్రసన్న గారు

డైరెక్టర్

శ్రీ. జయేష్ రంజన్, ఐఎఎస్

డైరెక్టర్

శ్రీ. కె. రామక్రిష్ణా రావు, ఐఎఎస్

డైరెక్టర్

శ్రీ మధు రామచంద్ర రావు

ఇండిపెండెంట్ డైరెక్టర్

శ్రీ. జొయాంతా చక్రబోర్తి

డైరెక్టర్

శ్రీ. ఆంథోనీ క్రోంబెజ్

డైరెక్టర్

శ్రీ. కేమిలో పెరెజ్ పెరెజ్

డైరెక్టర్

శ్రీ సుబ్బారావు అమర్తలూరు

ఇండిపెండెంట్ డైరెక్టర్

డా. ఎం. రామచంద్రన్

ఇండిపెండెంట్ డైరెక్టర్

శ్రీ. ఇస్కందర్ మిజాల్ మహమూద్

డైరెక్టర్

శ్రీమతి బిజల్ తుషార్ అజింక్యా

ఇండిపెండెంట్ డైరెక్టర్

శ్రీ జి.ఎం. రావు

ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్

శ్రీ జి.బి.ఎస్ రాజు

మేనేజింగ్ డైరెక్టర్

శ్రీ. శ్రీనివాస్ బొమ్మిడాల

డైరెక్టర్

శ్రీ గ్రంధి కిరణ్ కుమార్

డైరెక్టర్

శ్రీ. ధర్మేంద్ర భోజ్‌వానీ

డైరెక్టర్

శ్రీ హెచ్.జె. దొర

డైరెక్టర్

శ్రీ. సి. ప్రసన్న గారు

డైరెక్టర్

శ్రీ. జయేష్ రంజన్, ఐఎఎస్

డైరెక్టర్

శ్రీ. కె. రామక్రిష్ణా రావు, ఐఎఎస్

డైరెక్టర్

శ్రీ మధు రామచంద్ర రావు

ఇండిపెండెంట్ డైరెక్టర్

శ్రీ. జొయాంతా చక్రబోర్తి

డైరెక్టర్

శ్రీ. ఆంథోనీ క్రోంబెజ్

డైరెక్టర్

శ్రీ. కేమిలో పెరెజ్ పెరెజ్

డైరెక్టర్

Mr. Iskandar Mizal Mahmood

Director

శ్రీమతి బిజల్ తుషార్ అజింక్యా

ఇండిపెండెంట్ డైరెక్టర్